విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడుతాం ; రామారావు 

విద్యుత్ కార్మికుల సమస్యలపై పోరాడుతాం ; రామారావు 
  • టీఈఈయూ(హెచ్142) రాష్ట్ర అధ్యక్షుడు రామారావు 

పాల్వంచ, వెలుగు: తెలంగాణ వి ద్యుత్  సంస్థల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎం ప్లాయిస్  యూనియన్(హెచ్142) నిరంతర పోరాటం చేస్తుందని యూనియన్  జెన్కో అధ్యక్షుడు కేవీ రామారావు తెలిపారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్  ప్రాంతీయ కార్యాలయంలో ఎన్పీడీసీఎల్  రాష్ట్ర జనరల్  బాడీ సమావేశానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు.

విద్యుత్  సంస్థల్లో దశాబ్దాలుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎన్పీడీసీఎల్  నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా బి దేవ్ సింగ్, ఏ నాగరాజు, ఉపాధ్యక్షుడిగా బి స్వామి, సహాయ కార్యదర్శిగా మోతీలాల్, ప్రచార కార్యదర్శిగా ఆర్  యాకయ్య, కోశాధికారిగా సీహెచ్  కృష్ణయ్య ఎన్నికయ్యారు.

సమావేశానికి జనగాం, ములుగు, పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లాల నుంచి కార్మికులు, నాయకులు తరలివచ్చారు. యూనియన్  నాయకులు డి సత్య రాజ్  స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్  సయ్యద్, వి కోటేశ్వర రావు పాల్గొన్నారు.