V6 News

తెలంగాణలో ఏసీబీ సంచలనం.. 10 ఇయర్స్ రికార్డ్ బ్రేక్

తెలంగాణలో ఏసీబీ సంచలనం.. 10 ఇయర్స్ రికార్డ్ బ్రేక్

ఏసీబీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2026 మొదటి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసింది  తెలంగాణ అవినీతి నిరోధక శాఖ. జనవరి నుంచి మార్చి వరకు భారీగా అవినీతి తిమింగలాలను ఏసీబీ అధికారులు బోనులో నిలబెట్టారు. ఈ అద్భుత పనితీరుపై ఏసీబీ డీజీ చారు సిన్హా సమగ్ర సమీక్ష నిర్వహించారు. అధికారుల సమర్థతను, నిబద్ధతను అభినందిస్తూ... విశేష ప్రతిభ కనబరిచిన వారికి 'రివార్డ్ మేళా'లో ఘనంగా సత్కరించారు.

అవినీతి అనేది దేశాన్ని లోపల నుంచి బలహీనపరిచే ఒక మహమ్మారి. పారదర్శకమైన పాలనే మన లక్ష్యం. కేసుల విచారణలో వేగం పెంచడమే కాకుండా పూర్తి ప్రొఫెషనల్, నిష్పాక్షిక పద్ధతుల్లో దర్యాప్తు కొనసాగిస్తామని డీజీ సిన్హా అన్నారు. కేవలం కేసులు నమోదు చేయడమే కాదు... అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించడమే ఏసీబీ సంకల్పం అని అన్నారు. 2026లో సాధించిన ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఏసీబీ సిద్ధమైందని వెల్లడించారు.