- ఏపీ, తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ల నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రా ల హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. గ్లోబల్ ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్లను తీర్చిదిద్దేందుకు పరస్పరం సహకారం అందించుకోవాలని డిసైడ్ అయ్యాయి. గురువారం ఏపీలోని విజయవాడలో ఏపీఎస్ సీహెచ్ఈ చైర్మన్ మధుమూర్తితో తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అకడమిక్ ఎక్సలెన్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్లలో రెండు రాష్ట్రాల మధ్య సహకారం పెంచుకోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మన స్టూడెంట్లలో స్కిల్స్ పెంచాలన్నారు. ఎమర్జింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌ను అందిపుచ్చుకోవాలని సూచించారు.
