తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీని సోమవారానికి (మార్చి 23) వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. శుక్రవారం (మార్చి 20) బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య శాశసన సభను వాయిదా వేశారు.

తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.   2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూ.3, 24, 234 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో ఆరుగ్యారెంటీలు, ఇందిరమ్మ ఇండ్లు, వద్యా శాఖ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది ప్రభుత్వం. 

అందులో భాగంగా గ్యారెంటీలకు  ఏకంగా రూ.50 వేల 713 కోట్ల కేటాయింపులు చేశారు. అదే విధంగా ప్రభుత్వం విద్యపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా బడ్జెట్ లో విద్య, మానవ వనరులకు విద్య, మానవ వనరులకు రూ.26 వేల 674 కోట్లు కేటాయించింది. 

ALSO READ : తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. రైతు భరోసాకు, ఆరు గ్యారెంటీలకు ఎంత కేటాయించారంటే..

ఆరుగ్యారెంటీల అమలుపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా బడ్జెట్ లో కేటాయింపులు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గృహ విద్యుత్, వంట గ్యాస్ సహా పలు గ్యారెంటీలు అమలులో ఉండగా మరిన్ని గ్యారెంటీలను అమలు చేసే దిశగా బడ్జెట్ లో కేటాయింపులు చేశారు.