తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. రైతు భరోసాకు, ఆరు గ్యారెంటీలకు ఎంత కేటాయించారంటే..

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. రైతు భరోసాకు, ఆరు గ్యారెంటీలకు ఎంత కేటాయించారంటే..
  • రూ.100 కోట్లతో హాస్టళ్లు, కిచెన్ల ఆధునీకరణ
  • ఫుడ్ పాయిజన్ సమస్య పరిష్కారానికి చర్యలు
  • ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల కేటాయింపు
  • ఉద్యోగుల హెల్త్ స్కీంకు రూ.15 వందల కోట్లు
  • ఇంటర్ చదివే దివ్యాంగులకు వాహనాలు
  • ఈ ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి
  • ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం
  • ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకూ బ్రేక్ ఫాస్ట్ స్కీం
  • విద్యుత్ సబ్సిడీ రూ.14 వేల కోట్లు
  • ఎస్డీఎఫ్ రూ.3 వేల 300 కోట్లు
  • స్కాలర్ షిప్లు రూ.4 వేల 343 కోట్లు
  • విద్యార్థుల మెస్ ఛార్జీలు-రూ.2 వేల 170 కోట్లు
  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలకు రూ.3 వేల 683 కోట్ల కేటాయింపులు
  • బియ్యం సబ్సిడీ రూ.3 వేల కోట్లు
  • ఈ ఏడాది నుంచే సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీం
  • కార్మిక శాఖ ఆధ్వర్యంలో సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ స్కీం
  • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.350 కోట్లు
  • డ్వాక్రా గ్రూప్స్కు రూ.2 వేల 500 కోట్ల వడ్డీ లేని రుణాలు
  • ATCలో ట్రైనీ నిరుద్యోగులకు రూ.2 వేల స్కాలర్ షిప్
  • గురుకుల కిచెన్ల రిపేర్లకు రూ.100 కోట్లు
  • ఈ ఆటోలను ప్రభుత్వ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని ప్రభుత్వ ప్రకటన
  • క్యూర్ పరిధిలో పెట్రోల్, డీజిల్ ఆటోలపై కీలక నిర్ణయం
  • రాష్ట్రంలో కోటీ 15 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది
  • ఇంటి పెద్ద చనిపోతే ఇందిరమ్మ కుటుంబ బీమా కింద రూ.5 లక్షల బీమా
  • కొత్తగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రకటన
  • ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షల ఆర్థిక సాయం
  • 274 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు
  • టూరిజం రంగానికి రూ.12 వందల 24 కోట్లు
  • గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల కేటాయింపు
  • లా అండ్ ఆర్డర్ రూ.11 వేల 907 కోట్లు
  • మున్సిపల్ శాఖకు రూ.17 వేల 907 కోట్లు
  • న్యాయ శాఖకు రూ.2 వేల 367 కోట్లు
  • హైదరాబాద్ అభివృద్ధికి రూ.2 వేల 654 కోట్లు
  • రవాణా శాఖకు రూ.12 వేల 789 కోట్లు
  • సాగు నీటి ప్రాజెక్టులకు రూ.22 వేల 615 కోట్లు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.33 వేల 688 కోట్ల కేటాయింపులు
  • చేనేత రంగం రూ.258 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ.3 వేల 490 కోట్ల కేటాయింపులు
  • ఐటీ శాఖకు రూ.875 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖకు రూ.7 వేల 430 కోట్లు
  • రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ.3 వేల 769 కోట్లు
  • BC సంక్షేమ శాఖకు రూ.12 వేల 511 కోట్లు
  • ST సంక్షేమ శాఖకు రూ.7 వేల 937 కోట్లు
  • SC సంక్షేమ శాఖకు రూ.11 వేల 784 కోట్లు
  • ఆరు గ్యారంటీలకు రూ.50 వేల 713 కోట్ల కేటాయింపు
  • మహిళ, శిశు సంక్షేమం రూ.3 వేల 143 కోట్లు
  • కార్మిక శాఖకు రూ.998 కోట్ల కేటాయింపు
  • వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్లో రూ.13 వేల 679 కోట్ల కేటాయింపు
  • విద్య, మానవ వనరులకు రూ.26 వేల 674 కోట్లు
  • విద్యుత్ శాఖకు రూ.21 వేల 285 కోట్ల కేటాయింపులు
  • మహాలక్ష్మి పథకానికి రూ.4 వేల 305 కోట్ల కేటాయింపులు
  • వడ్ల బోనస్కు రూ.3 వేల 500 కోట్లు
  • చేయూత పథకానికి రూ.14 వేల 861 కోట్లు
  • ఇందిరమ్మ ఇళ్ల స్కీంకు బడ్జెట్లో రూ.5 వేల 500 కోట్ల కేటాయింపులు
  • మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖకు రూ.15 వందల 29 కోట్లు
  • రైతు భరోసాకు రూ.18 వేల కోట్ల కేటాయింపులు
  • పౌర సరఫరాల శాఖకు రూ.7 వేల 366 కోట్లు
  • వ్యవసాయం, రైతు సంక్షేమం రూ.23 వేల 179 కోట్లు
  • మూలధన వ్యయం రూ.47 వేల 267 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ. 2 లక్షల 34 వేల 406 కోట్లు
  • రూ.3 లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ ఆర్థిక బడ్జెట్ 
  • తెలంగాణ వృద్ధి రేటు 8 శాతం.. దేశం సగటు కంటే 2 శాతం అధికం
  • దేశానికే గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ
  • 10.7 శాతానికి పెరిగిన తెలంగాణ జీడీపీ వృద్ధి
  • తెలంగాణ ఆచరిస్తున్న విధానాలు.. అభివృద్ధికి తోడ్పడుతున్నాయనటానికి ఇదే నిదర్శనం
  • తెలంగాణ తలసరి ఆదాయం.. 4 లక్షల 18 వేలు
  • మేం పాలకులం కాదు.. సేవకులుగా భావిస్తూ ప్రజా పాలన సాగిస్తున్నాం
  • అంబేద్కర్ చెప్పిన విధంగా పాలన కొనసాగిస్తున్నాం: భట్టి విక్రమార్క
  • శాసనమండలిలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • శాసనసభలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
  • తెలంగాణ వార్షిక బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
  • మూసీ రివర్​ఫ్రంట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీకి బడ్జెట్లో నిధుల కేటాయింపులకు ఛాన్స్
  • వ్యవసాయంలో రైతు భరోసా, రైతు బీమాకు మంచి కేటాయింపులకు అవకాశం
  • పాలమూరు ప్రాజెక్టు పూర్తికి, తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మణానికి పెద్ద ఎత్తున నిధుల కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం
  • బడ్జెట్లో విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం
  • ఈసారి పన్ను ఆదాయాన్ని రూ.1.90 లక్షల కోట్లకు పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం
  • 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ.3.36 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనాలు
  • మార్చితో ముగియనున్న 2025–26 బడ్జెట్​ రూ.3.04 లక్షల కోట్లు
  • తెలంగాణ అసెంబ్లీలో 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతో పాటు సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిస్తూ 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను రేవంత్ సర్కార్ ​సిద్ధం చేసింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి(2026–27) ఏకంగా రూ.3.36 లక్షల కోట్ల వరకు బడ్జెట్ను పెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మార్చితో ముగియనున్న 2025–26 బడ్జెట్​ రూ.3.04 లక్షల కోట్లుగా ఉన్నది. 

కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా ఆదాయం ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్లు పెరగడం, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా పక్కాగా చెల్లించి, పెద్ద ఎత్తున నిధులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున  రుణాలను రీస్ట్రక్చర్ చేయడం, రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ మరిన్ని రుణాలను కూడా రీస్ట్రక్చర్​ చేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా అప్పులు, వడ్డీల భారం తగ్గుతుంది.