పరిమితికి మించి సరుకులు రవాణా చేయొద్దు.. భారీ వాహన యజమానులకు జేటీసీ చంద్ర శేఖర్ గౌడ్ హెచ్చరిక

పరిమితికి మించి సరుకులు రవాణా చేయొద్దు.. భారీ వాహన యజమానులకు జేటీసీ చంద్ర శేఖర్ గౌడ్ హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థలు భారీ వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జేటీసీ చంద్ర శేఖర్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్​లో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. క్వారీలు, పెద్ద, పెద్ద కంపెనీలు, ఇతర లోడింగ్ పాయింట్ల వద్ద వాహనాల్లో అనుమతికి మించి సరుకులు, ఖనిజాలు సరఫరా చేస్తున్నారని, వీటికి సంబంధించి వే బిల్లులు, ట్రాన్సిట్ రశీదులు జారీ చేస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించామని వివరించారు. ఇలాంటి రశీదులు జారీ చేయడం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, రవాణా శాఖ నిబంధనలను వ్యతిరేకమని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రాస్ వెహికల్ వెయిట్ (జీవీడబ్ల్యూ)కు మించి ఏ వాహనాన్ని నడపడానికి వీలులేదని స్పష్టం చేశారు.