- 6 కి.మీ. మారథాన్‌ను ప్రారంభించిన సీఎం విజయ్
చెన్నై: డ్రగ్స్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన మారథాన్‌లో ఆ రాష్ట్ర సీఎం విజయ్ పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థులు, యువతతో కలిసి 6 కిలోమీటర్లు పరుగెత్తారు. చెన్నై మెరీనా బీచ్ వద్ద నిర్వహించిన ‘స్టార్ట్ రన్.. స్టాప్ డ్రగ్స్’ మారథాన్‌కు విజయ్ జెండా ఊపి ప్రారంభించారు.
‘డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై కుటుంబ సభ్యులు, స్నేహితులకు అవగాహన కల్పిస్తామని, డ్రగ్స్ బారిన పడిన వారికి కోలుకునేలా సహకరిస్తామని’ యువతతో విజయ్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వేదికపై నుంచి నేరుగా దిగివచ్చి పరుగు ప్రారంభించారు. సంప్రదాయంగా జెండా ఊపడం లేదా కొద్దిదూరం మాత్రమే పరుగెత్తడం కాకుండా మొత్తం 6 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయడం ఆకట్టుకుంది.
