గచ్చిబౌలి: టీ గోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న టీ9 చాలెంజ్–2026 గోల్ఫ్ టోర్నీలో బంకర్ బస్టర్స్ , దాసోస్ బై మహి జట్లు ఫైనల్లోకి అడుగుపెట్టాయి. తొలి సెమీఫైనల్లో బంకర్ బస్టర్స్ 3.5–1.5 స్కోరు తేడాతో హైదరాబాద్ గోల్ఫర్ యునైటెడ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బస్టర్స్ జట్టు పూర్తి ఆధిపత్యం కనబరచగా.. గోల్ఫర్ యునైటెడ్ పెద్దగా పోటీనివ్వలేకపోయింది.
రాకి సిన్హా, ప్రతాప్ సింగ్ రనావత్, ఎస్ మురళీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో సెమీఫైనల్లో దాసోస్ బై మహి జట్టు 2.5–1.5 స్కోరుతో చాముండి బౌల్డర్ హిల్స్ టైగర్స్‌పై గెలిచింది. కెప్టెన్ కెబీఎన్ రాజు, రామ్ మండవ శుభారంభం ఇవ్వగా, మహేశ్ కాట్రగడ్డ స్కోరు సమం చేశాడు. తర్వాత విజయ్ కుమార్ రెడ్డి దాసోస్ జట్టుకు విజయాన్నందించాడు. శనివారం జరిగే ఫైనల్స్‌లో బంకర్ బస్టర్స్, దాసోస్ బై మహి టైటిల్ కోసం తలపడనున్నాయి.
