FIFA: టర్కీ సంచలన విజయం.. 3–2తో అమెరికాపై గెలుపు

FIFA: టర్కీ సంచలన విజయం.. 3–2తో అమెరికాపై గెలుపు

ఇంగిల్‌‌‌‌వుడ్: గ్రూప్‌‌‌‌–డి చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో టర్కీ అద్భుతాన్ని చేసింది. 3–2తో అమెరికాను ఓడించింది. యూఎస్‌‌‌‌ తరఫున ఆస్టన్‌‌‌‌ ట్రస్టీ (3వ ని), సెబాస్టియన్‌‌‌‌ బెర్‌‌‌‌హాల్టర్‌‌‌‌ (49వ ని) గోల్స్‌‌‌‌ కొట్టారు. ఆర్డా గులెర్‌‌‌‌ (10వ ని),  బారిస్‌‌‌‌ అల్పార్‌‌‌‌ ఇల్మాజ్‌‌‌‌ (31వ ని), కాన్‌‌‌‌ అహియాన్‌‌‌‌ (90+8వ ని) టర్కీ తరఫున గోల్స్‌‌‌‌ చేశారు.

ఇప్పటికే యూఎస్‌‌‌‌ నాకౌట్‌‌‌‌కు చేరడంతో 9 మంది కొత్త ప్లేయర్లను బరిలోకి దించారు. గాయం కారణంగా గత మ్యాచ్‌‌‌‌లకు దూరమైన అమెరికా స్టార్ ఆటగాడు క్రిస్టియన్ పులిసిక్ 58వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టాడు. అభిమానుల కోలాహలం మధ్య బరిలోకి దిగిన పులిసిక్.. 63వ నిమిషంలో గోల్ చేసేందుకు ప్రయత్నించినా టర్కీ కీపర్ ఉగుర్కాన్ కాకిర్ దాన్ని చాకచక్యంగా అడ్డుకున్నాడు.

ఇదే గ్రూప్‌‌‌‌లో ఆస్ట్రేలియా, పరాగ్వే మధ్య జరిగిన మ్యాచ్‌‌‌‌ 0–0తో డ్రా అయ్యింది. ఈ ఫలితంతో ఆసీస్‌‌‌‌ మూడోసారి నాకౌట్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు దూసుకెళ్లగా, పరాగ్వే అవకాశాలను మెరుగుపర్చుకుంది.