FIFA: కుండపోత వర్షంలోనూ అద్భుత ప్రదర్శన.. ట్యునీషియాపై గెలిచి గ్రూప్ ఎఫ్ టాపర్గా నెదర్లాండ్స్

FIFA: కుండపోత వర్షంలోనూ అద్భుత ప్రదర్శన.. ట్యునీషియాపై గెలిచి  గ్రూప్ ఎఫ్ టాపర్గా నెదర్లాండ్స్

కాన్సాస్ సిటీ: కుండపోత వర్షంలోనూ నెదర్లాండ్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. గ్రూప్‌‌‌‌–-ఎఫ్‌‌‌‌ చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌లో ట్యునీషియాపై 3–1 తేడాతో గెలిచి నాకౌట్‌‌‌‌కు అర్హత సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ట్యునీషియాకు గట్టి షాక్ తగిలింది.

డచ్ ఆటగాడు డెంజెల్ డమ్‌‌‌‌ఫ్రైస్ విసిరిన బంతిని క్లియర్ చేసే క్రమంలో ట్యునీషియా కెప్టెన్ ఎల్లీస్ స్కిరి పొరపాటున తమ సొంత నెట్‌‌‌‌లోకి పంపాడు. దీంతో నెదర్లాండ్స్‌‌‌‌కు ఉచితంగా తొలి గోల్ లభించింది. 7వ నిమిషంలో నెదర్లాండ్స్‌‌‌‌కు లభించిన ప్రీ కిక్‌‌‌‌ను కెప్టెన్ వర్జిల్ వాన్ డయాక్ హెడర్ ద్వారా పాస్ చేయగా.. బ్రియాన్ బ్రాబీ దాన్ని గోల్‌‌‌‌గా మలిచాడు.

54వ నిమిషంలో ట్యునీషియా ఆటగాడు హజీమ్ మస్తౌరి కార్నర్ కిక్‌‌‌‌ను గోల్‌‌‌‌గా మార్చి స్కోరును 2–1కి తగ్గించాడు. అయితే, 62వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు జాన్ పాల్ హెడర్ కొట్టిన బంతి.. ట్యునీషియా ఆటగాడు అనిస్ స్లిమనే తలకు తగిలి మళ్లీ సొంత నెట్‌‌‌‌లోనే పడింది.

ఇదే గ్రూప్‌‌‌‌లో జపాన్‌‌‌‌.. స్వీడన్‌‌‌‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌‌‌ 1–1తో డ్రా అయ్యింది. దాంతో రెండు జట్లూ నాకౌట్‌‌‌‌కు అర్హత సాధించాయి. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌‌‌లో ఆరు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌‌‌‌ నమోదయ్యాయి. రిట్సు దోవాన్‌‌‌‌ (56వ ని) జపాన్‌‌‌‌కు, ఆంథోనీ ఎలాంగా (62వ ని) స్వీడన్‌‌‌‌కు గోల్స్‌‌‌‌ అందించారు.