తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఇరిగేషన్ శాఖకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ నివేదిను సభలో వివరించనున్నారు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశం సైతం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహరణపై సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీథర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రభుత్వ విప్ లతో చర్చరించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు, సలహాలు ఇచ్చారు.