తెలంగాణలో 35 వేల 356 పోలింగ్ స్టేషన్లు

తెలంగాణలో 35 వేల 356 పోలింగ్ స్టేషన్లు

ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల  ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్  కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.  తెలంగాణతో పాటు  రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు .  ఐదు రాష్ట్రాల్లో 579 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 16.14 కోట్ల ఓట్లు ఉన్నాయని తెలిపారు.తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.  

ఐదు రాష్ట్రాల్లో 1.77 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో 35 వేల 356 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుందన్నారు.  ప్రతి  897 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.  తెలంగాణలో మొత్తం 3.17 ఓటర్లు కాగా..  మొత్తం  6 లక్షలకు పైగా ఓట్లు తొలగించామని చెప్పారు. తెలంగాణలో  కొత్త ఓటర్లు 17 లక్షల మంది అని వెల్లడించారు.  వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు రాజీవ్ కుమార్.  పోలింగ్ శాతం పెంచటమే తమ  లక్ష్యమని..  అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు.