V6 News

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం : సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీ ప్రాంగణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం శాసన మండలిలోని తన చాంబర్‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌‌‌‌ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఇందులో అసెంబ్లీ, కౌన్సిల్ అధికారులతో పాటు ఆర్ అండ్ బీ ఆఫీసర్లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సభా గౌరవం పెరిగేలా అసెంబ్లీని తీర్చిదిద్దాలని ఆదేశించారు. సభ్యులకు మరింత గౌరవం దక్కేలా పబ్లిక్ గార్డెన్‌‌లో క్లబ్, వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం చేయాలన్నారు.