ఇంటర్ రిజల్ట్​: సమస్య పరిష్కారానికి సర్కారు సమాలోచనలు

ఇంటర్ రిజల్ట్​: సమస్య పరిష్కారానికి సర్కారు సమాలోచనలు
  • మేనేజ్​మెంట్ల వారీగా వివరాలు ఇవ్వాలని విద్యాశాఖకు ఆదేశం 
  • సమస్య పరిష్కారానికి సర్కారు సమాలోచనలు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాలపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ మేరకు ఫస్టియర్ రిజల్ట్​పై సీఎంవో శనివారం ఆరా తీసినట్టు తెలిసింది. మొత్తం 51 శాతం మంది స్టూడెంట్స్ ఫెయిల్​కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే అన్ని మేనేజ్​మెంట్ల వారీగా పాస్, ఫెయిల్ డీటెయిల్స్ ఇవ్వాలని విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులను సీఎంవో ఆఫీసర్లు ఆదేశించినట్టు సమాచారం. దీంతో సర్కారు, ప్రైవేటు, గురుకులాలు, ఎయిడెడ్​కాలేజీలు వివరాలను ఇంటర్ బోర్డు అధికారులు అందించినట్టు తెలిసింది. ఇతర రాష్ర్టాల్లో ఫస్టియర్ పరీక్షల నిర్వహణ, ఫెయిల్ అయితే ఆయా రాష్ర్టాలు అనుసరించిన విధానాలనూ ఇంటర్ బోర్డు అధికారుల ద్వారా సీఎంవో సేకరించినట్టు సమాచారం. కాగా 4,59,242 మంది స్టూడెంట్లు పరీక్ష రాస్తే వారిలో 2,24,012 మంది మాత్రమే పాసయ్యారు. సర్కారు కాలేజీల్లో 33 శాతం, ప్రైవేటులో 55 శాతం మంది స్టూడెంట్లు పాసైనట్టు సమాచారం. మరోపక్క గురుకులాల్లోనూ ఈ సారి భారీగా రిజల్ట్ తగ్గింది. కేవలం 62 శాతం మాత్రమే పాసయ్యారని తెలిసింది. అయితే మేనేజ్​మెంట్ల వారీగా వివరాలను ఇంటర్ బోర్డు అధికారులు గోప్యంగా పెడుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.