- ఢిల్లీ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో జితేందర్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ వేడుకలు పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోందన్నారు.
అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భవన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు- ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, తెలంగాణ భవన్ అధికారులు, ఇతర సిబ్బంది, తెలంగాణ ఉద్యమకారులు, అధికారులు, ఢిల్లీలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
