మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కు రూ. వెయ్యి కోట్లు

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కు రూ. వెయ్యి కోట్లు

మూసీ నది పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్​ ఫోకస్​ పెట్టినట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తూ.. పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించామని.. అందులో భాగంగా 2024, 25 బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి. 56 కిలో మీటర్ల పొడవునా మూసీ నది ప్రక్షాళన కోసం, దాని వెంట గ్రీన్​ పార్కులు, షాపింగ్​ కాంప్లెక్స్​ల ఏర్పాటు కోసం బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

లండన్ లోని థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాదచారుల జోన్స్, పీపుల్స్ ప్లాజా, చిల్డ్రన్స్ పార్కులు.. మూసీ నదీ తీరాన్ని పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దటానికి కట్టుబడి ఉన్నామన్నారు. వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూనే.. మూసీ నది రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు డెవలప్ మెంట్ జరుగుతుందన్నారు.

also read : TSPSCకి రూ. 40 కోట్లు కేటాయింపు : భట్టి విక్రమార్క

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును హైదరాబాద్ సిటీకి మరో మణిహారంగా మారుతుందన్నారు. చార్మినార్, ట్యాంక్ బండ్ తరహాలో మూసీ ప్రాజెక్టు అద్భుతంగా తీర్చిదిద్దనున్నామని.. అందుకోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.