TSPSCకి రూ. 40 కోట్లు కేటాయింపు : భట్టి విక్రమార్క

TSPSCకి  రూ. 40 కోట్లు కేటాయింపు :  భట్టి విక్రమార్క

టీఎస్పీఎస్సీకి బడ్జెట్ లో రూ. 40 కోట్లకు కేటాయిస్తామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. యువకులను రెచ్చగొట్టడం కాదు.. అక్కున చేర్చుకుంటామని చెప్పారు. వారికీ ఆసరాగా ఉంటామని.. అందరినీ ఆదుకుంటామని పేర్కొన్నారు. జాబ్ క్యాలెడర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. 

త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటదని  వెల్లడించారు. అలాగే15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తామన్నారాయన. గ్రూప్ -1 లో 64 ఉద్యోగాలని చేర్చి భర్తీ చేయబోతున్నాయని వివరించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ గ్రూప్ -1 ఉద్యోగాలను ఇవ్వలేదని.. దానివల్ల యువత భవిష్యత్ ఆగం అయిందని విమర్శించారు. 

యువతకు వంద శాతం ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తామన్నారు. గురుకులాలకు సొంత భవనాల కోసం రూ. 1546 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ప్రతీ మండలంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. 

త్వరలో రైతు రుణమాఫీ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు భట్టి. విధివిధానాలు రూపొందించా రైతు రుణ మాఫీకి నిధులు కేటాయిస్తామని అన్నారు.

Also Read : హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో మూడు జోన్లు