అనుకున్నదే జరిగింది.. ఇంగ్లండ్ ఓపెనర్ మళ్లీ ఫెయిల్.. అంబ్రీష్ బౌలింగ్లో బౌల్డ్

అనుకున్నదే జరిగింది.. ఇంగ్లండ్ ఓపెనర్ మళ్లీ ఫెయిల్.. అంబ్రీష్ బౌలింగ్లో బౌల్డ్

హరారే: అనుకున్నదే జరిగింది. 412 పరుగుల భారీ టార్గెట్ ఛేజింగ్లో ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. తొలి రెండు ఓవర్లు టీమిండియా బౌలర్లు ఒక్క పరుగు రానివ్వకుండా కట్టడి చేశారు. ఆ తర్వాత.. ఇంగ్లండ్ ఓపెనర్ జోసెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూర్స్‌ నాలుగు ఫోర్లతో చెలరేగి స్పీడ్ పెంచినప్పటికీ ఆ జోరు కాసేపటికే ఆవిరైపోయింది.

టీమిండియా బౌలర్ ఆర్ఎస్ అంబ్రీష్​ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ ఓపెనర్ మూర్స్ 16 బంతుల్లో 17 పరుగులు చేసి నిరాశగా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్ దగ్గర నుంచి మూర్స్ ఫామ్ కోల్పోయాడు. బంగ్లాతో ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ మూర్స్ ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు.

ఆ తర్వాత న్యూజిలాండ్ మ్యాచ్లో 40 బంతుల్లో 20 పరుగులు, ఆస్ట్రేలియా మ్యాచ్లో 33 బంతుల్లో 25 పరుగులు, కీలకమైన ఫైనల్ మ్యాచ్లో 16 బంతుల్లో 17 పరుగులు. ఇలా ఈ ఇంగ్లండ్ ఓపెనర్ ఫామ్ కోల్పోవడం.. టీమిండియా 412 పరుగుల టార్గెట్ పెట్టడంతో ఇంగ్లండ్ బ్యాటర్లపై తీవ్రంగా ఒత్తిడి ఉంది.

ఇక.. మరో ఓపెనర్ బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాకిన్స్‌ కూడా చేతులెత్తేస్తే ఇంగ్లండ్ ఈ మ్యాచ్లో గెలవడం దాదాపు కష్టమే. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాకిన్స్‌ 21 బంతుల్లో 25 పరుగులు, బెన్ మేయెస్‌ ఏడు బంతుల్లో రెండు పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.