PEDDI Tickets: తెలంగాణలో భారీగా ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు.. సింగిల్, మల్టీప్లెక్స్లో ధర ఎంతంటే?

 PEDDI Tickets: తెలంగాణలో భారీగా ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు.. సింగిల్, మల్టీప్లెక్స్లో ధర ఎంతంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. సస్పెన్స్ మెంటేన్ చేస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ కావడంతో ఫ్యాన్స్ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు.

తెలంగాణలో ‘పెద్ది’ టికెట్ ధరలు ఇవే..

‘పెద్ది’ చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చింది. అలాగే జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్పెషల్ షో టికెట్ ధరను జీఎస్‌టితో కలిపి రూ.600గా నిర్ణయించారు.

అదేవిధంగా సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు అదనపు టికెట్ ధరలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 అదనంగా వసూలు చేయవచ్చు. అంతేకాకుండా రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం టికెట్ల ధరలు పెంచిన తర్వాత సింగిల్ స్క్రీన్లలో రూ.275, మల్టీప్లెక్స్ లో రూ.445 వరకు ఒక టికెట్ ధర ఉంది. 

‘పెద్ది’కి U/A సర్టిఫికేట్..

ఇదిలా ఉంటే, సెన్సార్ బోర్డు ‘పెద్ది’ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యాక సినిమా వీక్షించిన అధికార బృందం రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రశంసించినట్లు సమాచారం. కాగా ఈ చిత్రం సుమారు 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాలు) నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.