హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో సమావేశంలో మాట్లాడారు.
మత్స్యకారులకు ఇన్సూరెన్స్, మోపెడ్ వాహనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించడంతో పాటు బకాయిల విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో చేపలను ఆహారంగా చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
