మహేశ్ ఫ్యామిలీకి రూ.50లక్షలు.. ప్రభుత్వ ఉద్యోగం

మహేశ్ ఫ్యామిలీకి రూ.50లక్షలు.. ప్రభుత్వ ఉద్యోగం

దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా వీర జవాన్ మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు సీఎం కేసీఆర్. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రూ. 50లక్షల ఆర్థిక సాహాయం అందించనున్నట్లు చెప్పారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.  మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయస్తామని హామీ ఇచ్చారు.