40 శాతం  జీతానికే పీఆర్సీ ఇస్తం

V6 Velugu Posted on Oct 25, 2021

సమగ్ర శిక్షా అభియాన్​ ఉద్యోగులకు సర్కారు కొర్రీలు 
మొత్తం జీతంలో కాకుండా స్టేట్ షేర్‌‌‌‌‌‌‌‌లో 30% పీఆర్సీకి ప్రభుత్వ ఆమోదం
ఆందోళనలో 18 వేల మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులు 
రాష్ట్రంలోని సర్కారు ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఎంప్లాయీస్, విద్యా వలంటీర్లకు ఏప్రిల్1 నుంచి 30 శాతం పీఆర్సీ వర్తిస్తుంది.- మార్చి 22న సీఎం కేసీఆర్  అసెంబ్లీలో చేసిన ప్రకటన ఇదీ.

కేజీబీవీ టీచర్లు, సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ఎంప్లాయ్స్​కు పీఆర్సీ అమలుపై రాష్ట్ర సర్కారు  కొర్రీలు పెడుతోంది.  వీరి జీతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం, 40 శాతం చొప్పున చెల్లిస్తుండగా... ప్రస్తుతం వీరికి వస్తున్న మొత్తం జీతంపై కాకుండా, స్టేట్‌ షేర్‌‌​ బేసిక్ పేపై 30 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది కూడా 2018 జులై1 కంటే ముందున్న ఎంప్లాయ్స్ కే వర్తింపజేయాలని డెసిషన్ తీసుకుంది. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా త్వరలోనే జీవో వచ్చే అవకాశముంది. దీంతో 18 వేల మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రకటనతో తమకు పీఆర్సీ వస్తుందని ఆశించిన కేజీబీవీ టీచర్లు, సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కాంట్రాక్టు, ఔ సోర్సింగ్ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌కు సర్కారు ధోకా ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రస్తుతం వీరికి వస్తున్న మొత్తం జీతంపై కాకుండా, స్టేట్ షేర్​ బేసిక్ పేపై పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఆమోదం పొందినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎస్ఎస్ఏ పరిధిలో మొత్తం18,346 మంది పనిచేస్తున్నారు. వీరిలో 9,756 మంది టీచింగ్, 8,590 మంది నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో మెజార్టీగా కేజీబీవీల్లో పనిచేసే వారితో పాటు క్లస్టర్, మండల, జిల్లా కేంద్రాల్లోని విద్యా శాఖ ఆఫీసుల్లో పనిచేసే వారు ఉన్నారు. వీరికి రూ.8,500 నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంది. చాలా మందికి రూ.15 వేల జీతం వస్తుంది. ఎస్ఎస్ఏ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కావడంతో దీనికయ్యే ఖర్చులను కేంద్రం 60 శాతం, రాష్ట్ర సర్కార్ 40 శాతం భరిస్తుంది. జీతాల్లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రానికి పీఏబీలో చెప్తున్న లెక్కలకు, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న జీతాలకు  చాలా తేడా ఉంటుంది. కేంద్రానికి ఎక్కువగా ఇస్తున్నట్టు చూపిస్తూ, రాష్ట్రంలోని ఉద్యోగులకు మాత్రం తక్కువ జీతాలిస్తున్నారు. అయితే 2015లో చివరిసారిగా ఎస్ఎస్ఏలోని చాలా మంది ఎంప్లాయీస్‌‌‌‌కు జీతాలు పెరిగాయి. అప్పటి నుంచి ఏటా జీతం పెంచుతామంటూ వస్తున్నారు. కాగా, ఏపీలో వీరికి రూ.23,500 జీతం ఉండగా, మళ్లీ ఈ నెలాఖరులో పీఆర్సీ అమలు చేయనున్నారు. 
పెరిగేది రూ.2,500 లోపే..
ఇప్పటికే చాలా డిపార్ట్‌‌మెంట్లలోని కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్‌‌కు ప్రస్తుత జీతంపై 30 శాతం పీఆర్సీ అమలు చేస్తున్నారు. కానీ ఎస్ఎస్ఏ పరిధిలోని ఎంప్లాయీస్‌‌కు మాత్రం ఇప్పటికీ పీఆర్సీ ప్రతిపాదనల్లోనే ఉంది. అయితే ప్రస్తుతం వస్తున్న జీతంపై కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 40 శాతం జీతం షేర్‌‌లోని బేసిక్ పేలో 30 శాతం పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీన్ని జూన్ నుంచి అమలు చేయనున్నారు. ఇదే జరిగితే ప్రతి ఉద్యోగికి రూ.1,500 నుంచి రూ.2,500లోపే జీతం పెరిగే అవకాశముంది. అయితే ఇది కూడా 2018 జులై1 కంటే ముందున్న ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే వర్తింపజేయనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా త్వరలోనే జీవో వచ్చే అవకాశముంది. దీంతో కొత్తగా వచ్చిన పీజీసీఆర్టీలు, డీఈఓ ఆఫీసుల్లో పనిచేసే టెక్నికల్ పర్సన్స్, యూఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసే ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు​ఇది వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. నేషనల్ హెల్త్ స్కీమ్‌‌లో ​పనిచేసే 13 వేల మందికీ ఇదే విధానం అమలు చేయనున్నట్టు సమాచారం.
 

Tagged TRS, government, Telangana, Employees, PRC, ssa, Corrections, samagra shiksha abhiyan, 40% salary

Latest Videos

Subscribe Now

More News