V6 News

తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. 16 మంది IASలను బదిలీ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. 16 మంది IASలను బదిలీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. 16 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా హనుమంతు, ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీగా ప్రావీణ్య, ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా సంతోష్, ఇంటర్ బోర్డ్ సెక్రటరీగా అభిలాష్ అభినవ్, పంచాయతీ రాజ్ స్పెషల్ సీఎస్గా దాన కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా విజయేంద్ర, ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్గా సంజయ్ కుమార్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • టీజీఎండీసీ ఎండీగా అనుదీప్ దుర్శెట్టి
  • కార్మిక, ఉపాధి శాఖ సెక్రటరీగా దాసరి హరిచందన
  • నారాయణపేట కలెక్టర్గా సీహెచ్ ప్రియాంక
  • నిర్మల్ కలెక్టర్గా భవేష్ మిశ్రా
  • హైదరాబాద్ కలెక్టర్గా ప్రియాంక అల
  • ములుగు కలెక్టర్గా హేమంత్ సహదేవ్ రావు
  • సంగారెడ్డి కలెక్టర్గా ప్రతీక్ జైన్
  • ఖమ్మం కలెక్టర్గా దివాకర
  • నాగర్ కర్నూల్ కలెక్టర్గా హేమంత్ కేశవ్ పాటిల్