హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 2022 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ పోస్టింగులు ఇచ్చింది. జిల్లా అడిషనల్ ఎస్పీలుగా ఉన్నవారిని ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో అడ్మిన్ ఏఎస్పీలుగా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఉన్న ఎస్.చిత్తరంజన్‌ను అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఆసిఫాబాద్‌గా బదిలీ చేశారు. కామారెడ్డి ఏఎస్పీ బొక్కా చైతన్య రెడ్డిని సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా నియమించారు. జనగామ ఏఎస్పీ పందెరే చేతన్ నితిన్‌ను జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా బదిలీ చేశారు.
భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌ను మెదక్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా, వరంగల్ ఏఎస్పీ నగ్రాలే శుభమ్ ప్రకాశ్‌ను నిజామాబాద్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గా, భైంసా అడిషనల్ ఎస్పీ/ఎస్‌డీపీఓ రాజేశ్ మీనాను వనపర్తి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా వనపర్తికి బదిలీ చేశారు. ఇక ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) పి.మౌనికను అదే హోదాలో కొనసాగిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. నిర్మల్ ఏఎస్పీ పాఠిపాక సాయికిరణ్‌ను భైంసా ఏఎస్పీగా నియమించగా, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టేను ఉట్నూరు ఏఎస్పీగా బదిలీ చేశారు.

