మీర్ చౌక్ ప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

మీర్ చౌక్ ప్రమాదం:  మృతుల కుటుంబాలకు  రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా

 పాతబస్తీ అగ్ని ప్రమాద  మతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క. ఉస్మానియా మార్చురీకి వచ్చి పోస్టుమార్టం ప్రక్రియను వేగవంతం చేసేలా చూశారు. అనంతరం  మాట్లాడిన భట్టి విక్రమార్క..   ఉస్మానియాలో 17 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందన్నారు. ఘటన చాలా బాధకరమన్నారు. ప్రాణాలు తీసుకురాలేం..కానీ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నారు.   షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుందన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి వచ్చాయన్నారు. ప్రమాదంపై సీఎం రేవంత్, కేబినెట్ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అధికారులతో సీఎం మాట్లాడారని ఎప్పారు. బాధిత కుటుంబాలతో సీఎం మాట్లాడారని చెప్పారు.  మంత్రి పొన్నం ప్రభాకర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రమాదంలో డీఎఫ్ వో అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.డీఎఫ్ వో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 

ALSO READ | సూర్యాపేటలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి  : డీఐఈవో భానునాయక్

హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఘటనా స్థలంలో ముగ్గురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో  మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. ప్రమాద సమయంలో భవనలో 30 మంది ఉండగా.. 17 మంది చనిపోయారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.