సూర్యాపేటలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి  : డీఐఈవో భానునాయక్

సూర్యాపేటలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి  : డీఐఈవో భానునాయక్

సూర్యాపేట, వెలుగు : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఐఈవో భానునాయక్ తెలిపారు. శనివారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8,600 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.

మొత్తం 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రానికి సీఎస్డీవోలను నియమించామన్నారు. జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలు, కోదాడలో 5, హుజూర్​నగర్ లో 2, తుంగతుర్తి 2, మఠంపల్లి, నేరేడుచర్ల, తిరుమలగిరి, మట్టపల్లిలో ఒక్కో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు.