ఫిడే చెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి అర్జున్‌‌‌‌‌‌‌‌ గెలుపు

ఫిడే చెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి అర్జున్‌‌‌‌‌‌‌‌ గెలుపు

బాకు (అజర్‌‌‌‌‌‌‌‌బైజాన్‌‌‌‌‌‌‌‌): ఫిడే చెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఎరిగైసి అర్జున్‌‌‌‌‌‌‌‌ హవా కొనసాగుతోంది.  మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్​ తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో నల్లపావులతో ఆడిన అర్జున్‌‌‌‌‌‌‌‌ 53 ఎత్తుల్లో ఇండియాకే చెందిన మరో గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానందపై విజయం సాధించాడు. 1–0తో ఆధిక్యంలో నిలిచిన అర్జున్‌‌‌‌‌‌‌‌ బుధవారం జరిగే రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో కనీసం డ్రా చేసుకున్నా సెమీస్‌‌‌‌‌‌‌‌ చేరుకుంటాడు. మరో ఇండియన్‌‌‌‌‌‌‌‌  డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో 48 ఎత్తుల్లో  నార్వే లెజెండ్‌‌‌‌‌‌‌‌ మాగ్నస్‌‌‌‌‌‌‌‌ కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిపోయాడు. ఇక, లోకల్​ ఫేవరెట్ అబసోవ్ నిజత్‌తో తొలి గేమ్​ను విదిత్​ సంతోష్​ డ్రా చేసుకున్నాడు.