
జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న అక్రమ కట్టడాలను కూడా తక్షణమే సీజ్ చేయాలంటూ ఆదేశించింది హైకోర్టు. షైక్ పేటలోని ఓయూ కాలనీలో అక్రమ నిర్మాణంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓయూ కాలనీలో రెండు ఫ్లోర్ల నిర్మానికి పర్మిషన్ తీసుకొని ఆరు ఫ్లోర్లు నిర్మిస్తున్నారని.. జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసినా లెక్క చేయకుండా 6 ఫ్లోర్లు నిర్మించారంటూ పిటిషన్ దాఖలు చేశారు జిజ్జువరపు రమేష్.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలపై కేసులో పెండింగ్ లో ఉన్నా కూడా సీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అక్రమ కట్ట్టడల విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను ఆదేశించింది హైకోర్టు.
►ALSO READ | ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది ఎస్సైల బదిలీ
అక్రమ నిర్మాణాల విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేసి చోద్యం చూస్తూ కూర్చోవద్దని జీహెచ్ఎంసీని మందలించింది హైకోర్టు. షోకాజ్ నోటీసులను లెక్కచేయకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని.. ఎలాంటి ఆలస్యం చేయకుండా అక్రమ కట్టడాలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. ఈ తీర్పుతో అక్రమ నిర్మాణాలకు ఫుల్ స్టాప్ పడాలని అన్నారు జస్టిస్ రెడ్డి.