
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 11 మంది రెగ్యులర్, పది మంది ప్రొఫెషనల్ ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇచ్చోడ ఎస్సై ఎ.తిరుపతి డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్‌కు, జైనథ్ పోలీస్ స్టేషన్ ఎస్సై వి.పురుషోత్తం ఇచ్చోడకు, బేల పోలీస్ స్టేషన్ ఎస్సై దివ్యభారతి తాంసికి, వీఆర్ నుంచి నాగనాథ్ బేలకు, తాంసి నుంచి డి.రాధిక తలమడుగుకు, గుడిహత్నూర్ ఎస్సై గౌతమ్ జైనథ్‌కు, తలమడుగు నుంచి బి.అంజమ్మ డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ కు, సిరికొండ పోలీస్ స్టేషన్ నుంచి డి.శివరాం ఆదిలాబాద్ టు టౌన్‌కు, ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి జి.అప్పారావు ఉట్నూర్ కు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి డి పద్మ ఇచ్చోడకు, ఆదిలాబాద్ టు టౌన్ నుంచి కె.రవీందర్ మావలకు బదిలీ అయ్యారు.
ఎస్ హెచ్‌వో విధులు నిర్వహించనున్న ప్రొఫెషనల్ ఎస్సైలు
జిల్లాలోని పదిమంది ప్రొఫెషనల్ ఎస్సైలు ఎస్ హెచ్ వో( స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ) విధులు కేటాయిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో కొమ్ము అఖిల్ -నార్నూర్, గడ్డం రమ్య జైనథ్, బోడ పీర్ సింగ్ నాయక్ భీంపూర్, ఎస్.శ్రీసాయి సిరికొండ, పిల్లి ప్రణయ్ కుమార్ మావల, సతలపల్లి పూజ - ఉట్నూర్, గడ్డల సంజయ్ కుమార్ -ఇచ్చోడ, కోట రాజశేఖర్ రెడ్డి బజార్హత్నూర్, ఎస్.జీవన్ రెడ్డి గాదిగూడ, మధు కృష్ణ గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.