పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన : కలెక్టర్ రాజర్షి షా

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదిలాబాద్​మున్సిపల్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్​ను ఆదివారం కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్​ఓటింగ్​ప్రక్రియను పరిశీలించారు. బ్యాలెట్ పేపర్ల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఓటింగ్ పూర్తయిన తర్వాత వాటిని నిబంధనల మేరకు భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల నోడల్ అధికారి ఫణీందర్ పాల్గొన్నారు.

దంత వైద్య సేవలు గిరిజన ప్రాంతాలకు చేరాలి

దంత వైద్య సేవలు ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చేరాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఆదివారం ఆదిలాబాద్​లోని ఓ ఫంక్షన్​ హాల్​లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్(ఐడీఏ)–2026 నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో పొగాకు వినియోగం అధికంగా ఉందని, దీనివల్ల వస్తున్న నోటి క్యాన్సర్ తదితర వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. 

ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా పొగాకు, మద్యం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. దీనికి ఐడీఏ, ఐఎంఏ తమవంతు సహకారం అందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు మెమొంటోలు అందజేశారు. ఐడీఏ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఆనంద్, కార్యదర్శి చిన్మయ్ వాజే, సీనియర్​ డాక్టర్లు డీఎన్.స్వామి, డి.చలపతిరావు ఉన్నారు.