సార్వత్రిక సమ్మెను సక్సెస్ చేయండి : ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్

సార్వత్రిక సమ్మెను సక్సెస్ చేయండి : ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్

ఆసిఫాబాద్, వెలుగు: ఈ నెల 12న నిర్వహించే  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణి, కాంట్రాక్టు, ఓబీ, కోల్ ట్రాన్స్​పోర్ట్ కార్మికులు సక్సెస్ చేయాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగె ఉపేందర్ కోరారు. నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం  ఖైరుగూడ ఓపెన్ కాస్ట్  ఓబీ  కాంట్రాక్టర్  శ్రీనివాసనాయుడుకు సమ్మె నోటీస్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకే లేబర్ కోడ్​లను తీసుకువచ్చిందని ఆరోపించారు. సింగరేణిలో నూతన బొగ్గు బావులను ఓపెన్ చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యుడు కొయ్యడ సాగర్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.