సింగరేణి మనుగడే ప్రభుత్వ లక్ష్యం : ఐఎన్టీయూసీ లీడర్జనక్ ప్రసాద్

సింగరేణి మనుగడే ప్రభుత్వ లక్ష్యం : ఐఎన్టీయూసీ లీడర్జనక్ ప్రసాద్
  •     హరీశ్​రావు అసత్య ప్రచారం చేస్తున్నరు
  •     ఐఎన్టీయూసీ లీడర్ జనక్ ప్రసాద్

నస్పూర్, వెలుగు: సింగరేణి మనుగడే లక్ష్యంగా కాంగ్రెస్​ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐఎన్టీయూసీ లీడర్​జనక్ ప్రసాద్ అన్నారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి హారీశ్​రావు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్‌ సింగరేణి కార్మికుల కష్టాన్ని దోచుకుందని, సీఎస్ఆర్ నిధులు సిద్దిపేట, సిరిసిల్లకు తరలించారని ఆరోపించారు. 

మీ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తే నిజాయతీ.. కాంగ్రెస్‌ సర్కారు ఇస్తే అవినీతా అని ప్రశ్నించారు. కార్మికులను సంప్రదించకుండా మెడికల్ కాలేజీకి రూ.500 కోట్లు ఎందుకిచ్చారో, కార్మికుల వారసులకు ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్​చేశారు. 

ఏఐటీయూసీ విమర్శలకు కార్మికులు నవ్వుకుంటున్నరు..

మున్సిపల్ ఎన్నికల్లో ప్రాంతాలను బట్టి పోత్తులు పెట్టుకుంటున్న ఏఐటీయూసీ విమర్శలు చేస్తుంటే కార్మికులు నవ్వుకుంటున్నారని జనక్​ప్రసాద్​ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఏఐటీయూసీ ఇప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు. ఎన్నికల తర్వాత కొత్త గనులు, సొంతింటి  పథకం, మారుపేర్ల మార్పు, పెర్క్స్ పై ఇన్​కం ట్యాక్స్ రద్దు వంటి కార్మికుల ప్రధాన సమస్యలను సీఎం రేవంత్​రెడ్డిని కలిసి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నాయకులు శంకర్ రావు, సమ్మయ్య, రవీందర్ రెడ్డి. శ్రీనివాస్, జీవన్ జోయల్ తదితరులు పాల్గొన్నారు.