- బౌరంపేట ల్యాండ్ ఇష్యూలో ఉత్తర్వుల నిలిపివేత
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం బౌరంపేటలోని సర్వే నంబర్166/9/2కు సంబంధించి వివిధ రికార్డులను పరిశీలించి అనుబంధ సేత్వార్జారీ చేయాలని ఆదేశించిన కలెక్టర్.. రాజకీయ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత ఉత్తర్వులను పక్కన పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఒకసారి ఉత్తర్వులు జారీ చేశాక ఎలా పక్కన పెడతారని ప్రశ్నించింది. సర్వే నంబర్‌కు సంబంధించి విచారణకు ఆదేశిస్తే తహసీల్దార్అత్యుత్సాహంతో భూమి కంచెకు తాళం వేయడం సరికాదంది.
కలెక్టర్ ఉత్తర్వులను నిలిపివేయడంతోపాటు కంచెకు వేసిన తాళాన్ని తక్షణమే తొలగించాలని కలెక్టర్, తహసీల్దార్‌ను ఆదేశించింది. మాజీ సైనికుల కోటా కింద కేటాయించిన 4.38 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వారికి సప్లిమెంటరీ సేత్వార్జారీ చేయాలంటూ కలెక్టర్ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత వాటిని పక్కన పెడుతూ.. ఈ నెల 13న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ ఎస్.జీవేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.శ్రీధర్ వాదనలు వినిపిస్తూ.. సర్వే నంబర్166/9లో పిటిషనర్కొనుగోలు చేసిన 4.38 ఎకరాలను మరో వ్యక్తికి మాజీ సైనికుల కోటా కింద కేటాయించినట్లు తేలిందన్నారు. దీంతో సప్లిమెంటరీ సేత్వార్‌కు పిటిషనర్ దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కలెక్టర్ రికార్డులను పరిశీలించి 166/9కు 166/9/1 కింద 5 ఎకరాలు ఒకరికి, 166/9/2 కింద పిటిషనర్ మాజీ సైనికుడి నుంచి కొనుగోలు చేసిన భూమికి సప్లిమెంటరీ సేత్వార్జారీ చేసి, రికార్డులను సవరించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.
రాజకీయ దురుద్దేశాలతో స్థానిక నాయకులు ఆకుల సతీశ్, డి.ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కలెక్టర్ గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను పక్కనపెడుతూ మళ్లీ ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఒకసారి ఉత్తర్వులు జారీ చేశాక అదే అంశంపై తిరిగి ఉత్తర్వులు ఇవ్వరాదన్నారు. ఈ నెల 13 నాటి కలెక్టర్ ఉత్తర్వుల అమలును నిలిపివేశారు. అంతేకాకుండా, పిటిషనర్ స్థలానికి ఉన్న తాళాన్ని తొలగించాలని ఆదేశిస్తూ విచారణను మే 6వ తేదీకి వాయిదా వేశారు.

