టీఎస్పీఎస్సీ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష ప్రాథమిక 'కీ' రిలీజ్

టీఎస్పీఎస్సీ  హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష ప్రాథమిక 'కీ' రిలీజ్

తెలంగాణలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి జూన్ 17న నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ', రెస్పాన్స్ షీట్లను టీఎస్‌పీఎస్సీ జూన్ 27 మంగళవారం విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది.  జులై 26 వరకు రెస్పాన్స్‌షీట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయని తెలిపింది. ఆన్సర్ కీపై  అభ్యంతరాలుంటే జూన్‌ 28 నుంచి జులై 1 వరకు స్వీకరిస్తామని పేర్కొంది.  అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఇంగ్లిష్‌లో మాత్రమే తమ అభ్యంతరాలు నమోదుచేయాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. 

తెలంగాణ ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో ఖాళీల భర్తీకీ 2022 డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.  మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు.. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి జనవరి 3 నుంచి  24 వరకు దరఖాస్తులు స్వీకరిచింది.  జూన్ 17న పరీక్ష నిర్వహించగా... 1,055 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.