
- ఫిబ్రవరి 28 నుంచి .. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్
- అదే నెల 16న ఫస్టియర్స్టూడెంట్లకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్
- షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి19 వరకు పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ శృతి ఓజా పరీక్షల షెడ్యూల్ ను గురువారం విడుదల చేశారు. ఫస్టియర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు కొనసాగుతాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 17న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ గతంలో ఫెయిలైన వారు, రాయని వారికి మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి19న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఉంటుందని వెల్లడించారు. తొలిసారిగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభిస్తున్నారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను కాస్త ముందుగా నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ఉంటాయి. రెండో శనివారం, ఆదివారం కూడా కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. కాగా, ఫిబ్రవ రి1న జేఈఈ ఎగ్జామ్ చివరిరోజు ఉండగా, అదే రోజు ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఏదైనా ఎగ్జామ్ ఉన్నా.. ఆ తేదీల్లో ప్రాక్టికల్స్ బ్యాచ్ ఉంటే, వేరే బ్యాచ్‌కు మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు.