V6 News

సర్కారు బడుల్లో ఏఐ ఎడ్యుకేషన్..28 వేల మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ: విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

సర్కారు బడుల్లో  ఏఐ ఎడ్యుకేషన్..28 వేల మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ: విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా

హైదరాబాద్, వెలుగు: మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. బుధవారం ఆమె ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్ ఆధ్వర్యంలో 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్', 'పై జామ్ ఫౌండేషన్' భాగస్వామ్యంతో చేపట్టిన ఏఐ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు టెక్నాలజీని వాడడమే కాకుండా, అది ఎలా పనిచేస్తుంది? నిత్యజీవిత సమస్యల పరిష్కారానికి దాన్ని ఎలా వాడుకోవాలి? అనే అంశాలను అర్థం చేసుకుంటారని చెప్పారు. 

కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 28 వేల మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.  సుమారు 20 లక్షల మంది సర్కారీ విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా  ప్రాజెక్టును చేపట్టారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, సమగ్ర శిక్ష జేడీ వెంకటనర్సమ్మ, అమెజాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.