
అమరుల కుటుంబాలు భువనగిరిలో ఆందోళనకు దిగాయి. తమను పక్కనబెట్టి ఆవిర్భావ వేడుకలు జరపడంపై ఆగ్రహించాయి. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి కుటుంబలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు అమరవీరుల కుటుంబాల సభ్యులు.
తమ పిల్లల ప్రాణత్యాగాలకు విలువలేకుండా చేస్తున్నారని… శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తమకు ముఖ్యం కాదని….. తమ కుటుంబాలకు గౌరవం కావాలని కోరారు.