మెడికల్ మేనేజ్‌‌‌‌మెంట్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మెడికల్ మేనేజ్‌‌‌‌మెంట్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  •     నేటి నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ 
  •     నీట్ స్కోరుతోనే ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్‌‌‌‌మెంట్ కోటా (బీ, సీ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు నేటి ఉదయం 6 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు https://tspvtmedadm.tsche.in వెబ్‌‌‌‌ సైట్​లో ఆన్‌‌‌‌ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ.12,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్‌‌‌‌ లోడ్ చేయాల్సి ఉంటుంది. 

నీట్ స్కోరులో జనరల్ అభ్యర్థులకు 213, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 177, దివ్యాంగులకు 194 మార్కులను కటాఫ్‌‌‌‌ గా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. బీ -కేటగిరీ సీట్లలో 85 శాతం స్థానిక అభ్యర్థులకే కేటాయించారు. అడ్మిషన్లు కేవలం మెరిట్ ప్రాతిపదికన ఆన్‌‌‌‌లైన్ వెబ్ ఆప్షన్ల ద్వారానే జరుగుతాయని, సీట్లు ఇప్పిస్తామనే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని వర్సిటీ రిజిస్ట్రార్ హెచ్చరించారు. సందేహాల కోసం 7901098840 నంబర్‌‌‌‌ను సంప్రదించవచ్చని సూచించారు.

మరిన్ని వార్తలు