ఆధునిక విద్యకు ఆద్యుడు ఆజాద్ : అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్

ఆధునిక విద్యకు ఆద్యుడు ఆజాద్ : అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్ కుమార్
  • అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​ కుమార్​     

వికారాబాద్​, వెలుగు: ఆధునిక విద్యకు ఆద్యుడు మౌలానా అబుల్​కలామ్ ఆజాద్​ అని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​ అన్నారు. మంగళవారం ఆయన జయంతి సందర్భంగా వికారాబాద్​లోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్​ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆజాద్ విద్యా విధాన రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. వికారాబాద్ గురుకుల పాఠశాలకు ఐదెకరాల స్థలం కేటాయించాలని స్పీకర్​ప్రసాద్​కుమార్​కలెక్టర్ ప్రతీక్​జైన్​కు సూచించారు. భవనాల నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 

లతీఫ్ ఖాన్​కు జాతీయ పురస్కారం

బషీర్​బాగ్: నెహ్రూ సమకాలికుడిగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జాతీయ భావాలు కల విద్యా వేత్త అని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. రవీంద్ర భారతిలో మంగళవారం తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యా వేత్త లతీఫ్ ఖాన్​కు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జాతీయ పురస్కార ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి అజారుద్దీన్ పాల్గొని పురస్కారం బహుకరించి మాట్లాడారు. లతీఫ్ ఖాన్ మూడు దశాబ్దాలుగా విద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేశారని కొనియాడారు. అకాడమీ వైస్ చైర్మన్ నజ్రత్ ఖాన్, అధికారులు అన్వర్ అహ్మద్ డాక్టర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.