తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం : గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా

తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం : గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌ శుక్లా అన్నారు. తెలంగాణ పోలీసులకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతర రాష్ట్రాలు మన వారిని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాజాబహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ 40వ వార్షికోత్సవాలు శుక్రవారం ముగిశాయి.

ఈ వేడుకకు గవర్నర్ ​హాజరై పోలీస్ అకాడమీ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర నియంత్రణలో తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. సైబర్ క్రైమ్ కేసులను అరికట్టడంలో విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరాలను ట్రేస్ చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారని కొనియాడారు.