ఎస్సై,కానిస్టేబుల్స్ ఫిజికల్ ఈవెంట్లు పూర్తి

ఎస్సై,కానిస్టేబుల్స్ ఫిజికల్ ఈవెంట్లు పూర్తి

హైదరాబాద్,వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఫిజికల్ ఈవెంట్ పరీక్షలు పూర్తయినట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. 1217 ఎస్సై,16,925 కానిస్టేబుల్, మెకా నిక్, డ్రైవర్ తదితర 18428 పోస్టుల భర్తీకి నిర్వహించి న ఈవెంట్లలో 1,71,253 మంది సెలెక్ట్ అయినట్లు తెలిపారు. ఇందులో 1,35,283 మంది పురుషులు, 35,970 మంది మహిళలు, 383 మంది ఎక్స్ సర్విస్ మెన్ లు ఉన్నారు. వివరాలు TSLPRB సైట్ లో అందుబాటులో ఉన్నాయని, ఫైనల్ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం లేదని చెప్పారు. ఏప్రిల్ 20, 21న ఎస్సై, 27, 28న కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.