బయో కెమికల్, బ్యాక్టీరియాతో..విధ్వంసానికి స్కెచ్!

బయో కెమికల్, బ్యాక్టీరియాతో..విధ్వంసానికి స్కెచ్!

 

  • బయో కెమికల్, బ్యాక్టీరియాతో..విధ్వంసానికి స్కెచ్!
  • దేశ వ్యాప్తంగా ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్’ ఉగ్రకుట్ర
  • మధ్యప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తుతో వెలుగులోకి
  • పరారీలో ఉన్న సల్మాన్ అరెస్ట్.. భోపాల్​కు తరలింపు
  • నిందితుల కాంటాక్ట్స్,  సోషల్ మీడియా డేటాపై ఆరా
  • సలీం నెట్​వర్క్​పై ఆరా తీసేందుకు భోపాల్ వెళ్లిన స్టేట్ పోలీసులు

హైదరాబాద్, వెలుగు :   టెర్రరిస్ట్ సంస్థ ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్’ ​పై మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు, అనుమానితుల కాల్‌‌ డేటా, వాట్సాప్‌‌, సోషల్‌‌మీడియా అకౌంట్స్‌‌ ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నది. పరారీలో ఉన్న మహ్మద్‌‌ సల్మాన్‌‌(27)ను బుధవారం అరెస్ట్ చేసింది.  మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మధ్యప్రదేశ్​కు తరలించింది. మహ్మద్ సల్మాన్ మేడ్చల్ జిల్లా జవహర్​నగర్​లోని శివాజీనగర్​లో ఉంటూ రోజువారీ కూలీగా పని చేసేవాడు. దేశవ్యాప్తంగా విధ్వంసాలకు ప్లాన్ చేశారనే సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ గోల్కొండలో సోదాలు చేసింది. డెక్కన్ కాలేజీలో బయోటెక్నాలజీ హెవోడీగా ఉన్న మహ్మద్​ సలీం అలియాస్ సౌరభ్​రాజ్ వైద్య, సాఫ్ట్​వేర్ ఇంజినీర్ అబ్దుల్ రహమాన్ అలియాస్ దేవీప్రసాద్ పాండ, డెంటిస్ట్ షేక్​ జునైద్​లను అరెస్ట్ చేశారు. 

టెర్రర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకులపై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఏ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కూడా కేసు నమోదు చేయనుంది. మధ్యప్రదేశ్ ఏటీసీ దర్యాప్తు వివరాలను కూడా సేకరిస్తున్నది. దేశవ్యాప్తంగా విస్తరించిన హిజ్బ్ ఉత్ తహ్రీర్ యాక్టివిటీస్​పై సమగ్ర విచారణ జరపనుంది. ఇప్పటికే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, లోకల్ పోలీసుల నుంచి సమాచారం సేకరించింది.  

ఆన్​లైన్​లో ట్రైనింగ్

సూసైడ్ బాంబర్స్, గ్రెనేడ్స్ తరహా దాడులు కాకుండా బయో టెక్నాలజీ, కెమికల్స్, బ్యాక్టీరియాతో విధ్వంసానికి ప్లాన్​ చేసినట్లు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. దీనికోసం సైన్స్, టెక్నాలజీపై పట్టున్న యువకులను రిక్రూట్​ చేసుకుంటున్నట్లు ఏటీసీ దర్యాప్తులో తేలింది. మెడికోలను ట్రాప్​ చేసేందుకే భోపాల్​కు చెందిన మహ్మద్ సలీం వైద్య కాలేజీలో చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

టెర్రర్ లింక్​లు ట్రేస్

భోపాల్​కు చెందిన మాన్సీ అగర్వాల్​కు 2009లో సౌరబ్ రాజ్​తో పెండ్లి జరిగింది. అప్పటికే సౌరబ్ ఇస్లామ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఇంట్లో నమాజ్ చేస్తూ ఉండేవాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగేది. 2010లో సౌరబ్ ఇస్లామ్​కు కన్వర్ట్ అయ్యా డు. దీంతో మాన్సీ అగర్వాల్ కూడా మతం మారింది. సౌరబ్ రాజ్ తన పేరును మహమ్మద్ సలీంగా మార్చుకున్నాడు. మాన్సీ పేరు మహ్మద్ రహీలగా మార్చుకుంది.  ఓ ఇస్లామిక్ కోర్స్ కోసం ఇద్దరు దంపతులు 2018లో హైదరాబాద్ వచ్చారు. గోల్కొండలో నివాసం ఉంటున్నారు. డెక్కన్ కాలేజీలో ఐదేండ్లుగా హెచ్​వోడీగా పని చేస్తున్నాడు.

గోల్కొండ అడ్డాగా యాక్టివిటీ

గోల్కొండ బడాబజార్​లో ఉంటున్న సలీం, డెంటిస్ట్ షేక్ జునైద్, అబ్దుల్ రహమాన్ కలి సి మెడికోలను ట్రాప్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సలీం నెట్​వర్క్​పై ఆరా తీస్తున్నారు. దీని కోసం రాష్ట్ర పోలీసులు భోపాల్ వెళ్లారు. రహమాన్​ ఎంఎన్​సీ కంపె నీలో క్లౌండ్​ సర్వీస్​ ఇంజినీర్​గా పని చేస్తుండ టంతో ఐటీ ఉద్యోగులను ట్రాప్​ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టెకీలను ఉగ్రవాదం వైపు మళ్లించేలా ప్లాన్ చేసిన ఆధారాలు లభించినట్లు సమాచారం. వీకెండ్స్​లో ఔట్​డోర్ ట్రైనింగ్ పేరుతో భోపాల్, మహారాష్ట్ర, బెంగళూరుకు తీసుకెళ్లినట్లు తెలిసింది.