మే 25, 26 తేదీల్లో ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభలు : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ

మే 25, 26 తేదీల్లో ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభలు : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ ప్రజా నాట్య మండలి 4వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25, 26 తేదీల్లో నారాయణగూడలోని మర్వెల్ ఫంక్షన్ హాల్‌‌‌‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తెలిపారు. శుక్రవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 25న ఉదయం 10 గంటలకు హిమాయత్ నగర్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు.

ఈ సభలో ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న తదితరులు పాల్గొంటారని తెలిపారు.