V6 News

రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌‌‌‌ల‌‌‌‌కు డీజీపీ హోదా

రాష్ట్రంలో ఆరుగురు  ఐపీఎస్‌‌‌‌ల‌‌‌‌కు డీజీపీ హోదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1995, 1996 బ్యాచ్‌‌‌‌లకు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)  హోదా కల్పిస్తూ పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

1995 బ్యాచ్ కు చెందిన వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు,  స్వాతి లక్రా, మహేశ్ మురళీధర్ భగవత్ లతో పాటు1996 బ్యాచ్ కు చెందిన చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్, వి.సి. సజ్జనార్‌‌‌‌‌‌‌‌లకు హోదా దక్కింది. పదోన్నతి పొందిన అధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.