ప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్.. జూన్ 17న సీఎం చేతుల మీదుగా ఓపెన్

ప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్.. జూన్ 17న  సీఎం చేతుల మీదుగా ఓపెన్

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని పలు ప్రభుత్వ స్కూళ్లను విలీనం చేసి ఆధునిక హంగులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్​గా ప్రభుత్వం తీర్చిదిద్దింది. రాష్ట్రానికే మోడల్‌‌‌‌గా తీర్చిదిద్దిన ఈ స్కూల్​ కార్పొరేట్‌‌‌‌, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకట్టుకుంటోంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనందించేలా రూపొందించిన ఈ స్కూల్​ను సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 17న ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోష్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డి, ఆకునూరి మురళి పరిశీలించారు