Rain Alert: నాలుగు రోజుల పాటు వానలే వానలు.. తెలంగాణలో ఎల్లో అలెర్ట్​ జారీ

Rain Alert:  నాలుగు రోజుల పాటు వానలే వానలు..  తెలంగాణలో ఎల్లో అలెర్ట్​ జారీ

ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి .  తెలుగు రాష్ట్రాల్లో నాలుగు  రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించిది.  మంగళవారం ( మే 27) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపడనం ఏర్పడి.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయి. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ రోజు ( మే 26)  నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి.  దీని ప్రభావంతో వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా  భారీ వర్షాలుల పడతాయని ఐఎండీ హెచ్చరించింది. 

ఇక తెలంగాణలో  నైరుతి రుతుపవనాలు ఈ నెల 28న ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. .   ప్రస్తుతం  ఉత్తర తెలంగాణ వరకు  కొనసాగుతున్న ద్రోణి కారణంగా  విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి .  వచ్చే నాలుగు రోజుల పాటు ( మే 26 నుంచి)  తెలంగాణలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు... మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు... ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది. 

తెలంగాణలోని పలు జిల్లాల్లో మే 27వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ తర్వాత కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని పేర్కొంది. భారీ వర్షాల సూచనతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్​.. నిర్మల్​... నిజామాబాద్​.. వికారాబాద్ ..సంగారెడ్డి ..మెదక్ ..కామారెడ్డి..  జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.  చాలా చోట్ల గంటలకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక 
హైదరాబాద్​ లో   తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని  వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.