70.40 లక్షల మంది  రైతులకు అందిన భరోసా..రూ. 8,759.60 కోట్లు జమ 

70.40 లక్షల మంది  రైతులకు అందిన భరోసా..రూ. 8,759.60 కోట్లు జమ 

హైదరాబాద్, వెలుగు:  రైతు భరోసా పథకం అమలులో భాగంగా ప్రస్తుత వానాకాలానికి 70.40 లక్షల మంది రైతులకు రాష్ట్ర సర్కారు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇప్పటివరకూ మొత్తం1.45 కోట్ల ఎకరాలకుగాను ఎకరానికి రూ.6 వేల చొప్పన రూ.8,759.60 కోట్ల నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.

  జిల్లాల వారీగా జమ చేసిన  రైతు భరోసా  నిధుల వివరాలను చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో  5.35లక్షల మంది రైతులకు రూ.716.86 కోట్లు జమ అయ్యాయి.  ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో  3.42లక్షల మంది రైతులకు రూ.428 కోట్లు, సంగారెడ్డిలో 3.16లక్షల మంది రైతులకు  రూ.418 కోట్లు, నాగర్ కర్నూల్​లో 3.08 లక్షల మంది రైతులకు  రూ.423 కోట్ల నిధులు జమ చేశారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 వేల మందికి రూ.23.62 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి.