లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సర్వేయర్ల తొలి విడత శిక్షణకు జాబితా విడుదల

లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సర్వేయర్ల  తొలి విడత శిక్షణకు జాబితా విడుదల

హైదరాబాద్, వెలుగు: లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తొలి విడత శిక్షణకు ఎంపికైన లిస్టును తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది. ఈ వివరాలను మీ-సేవ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, జిల్లా సర్వే కార్యాలయాల్లో, జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో చూడవచ్చని వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 26న వారి వారి జిల్లా కేంద్రాల్లోని జిల్లా సర్వే కార్యాలయాలకు హాజరు కావాలని తెలం గాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.