- ఈ నెల 17 నుంచి ఐఎస్‌ఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి మెడికల్ రీయింబర్స్‌మెం ట్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిం ది. గతంలో ఉన్న ఆన్‌లైన్ విధానాన్ని పునరు ద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇకపై మెడికల్ బిల్లుల దరఖాస్తులను ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఐఎస్ఎంఎస్) పోర్టల్ ద్వారానే పంపాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మంది టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. ఈ నెల 17 నుంచి మెడికల్ రీయింబర్స్‌మెంట్ ప్రతిపాదనలన్నీ ఆన్‌లైన్ ద్వారానే ప్రాసెస్ చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్లు , డీఈవోలు, డీడీవోలను ఆదేశించారు.
