V6 News

వాహన్ పోర్టల్ ద్వారానే ఫ్యాన్సీ నంబర్ల వేలం

వాహన్ పోర్టల్ ద్వారానే ఫ్యాన్సీ నంబర్ల వేలం

హైదరాబాద్, వెలుగు: “వాహన్” పోర్టల్ ద్వారానే ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహిస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు గురువారం వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 858 ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలం నిర్వహించినట్లు తెలిపారు.

వాహనాలకు పర్మనెంట్ నంబర్లు కూడా ఈ పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 , 200 వాహనాలకు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పోర్టల్ ను దశల వారీగా ఆర్టీఏలోని అన్ని సేవలకు విస్తరిస్తామని చెప్పారు.